News November 8, 2025
‘నీ భర్త అంకుల్‌లా ఉన్నాడు’ అని కామెంట్.. భార్య ఏం చేసిందంటే?

UP మీరట్‌కు చెందిన అంజలి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అంజలి, తన భర్త రాహుల్‌తో కలిసి ఇన్‌స్టా రీల్స్ చేసేది. ‘నువ్వు అందంగా ఉన్నావ్. నీ భర్తే అంకుల్‌లా ఉన్నాడు’ అని కామెంట్ రావడంతో అంజలి సహించలేకపోయింది. అదే గ్రామానికి చెందిన అజయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియగానే ప్రియుడితో కలిసి అతడిని తుపాకీతో కాల్చి చంపింది. పోలీసులు అంజలి, అజయ్‌ను అరెస్టు చేశారు.
Similar News
News November 8, 2025
మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షం కారణంగా రద్దయింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన భారత్ 4.5 ఓవర్లలో 52 రన్స్ చేసింది. ఈ క్రమంలోనే మొదలైన వర్షం పెద్దదైంది. దీంతో ఆట సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉన్న భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచులో ఆసీస్.. మూడు, నాలుగో టీ20ల్లో ఇండియా గెలిచింది.
News November 8, 2025
మాలిలో ఐదుగురు ఇండియన్ కార్మికుల కిడ్నాప్

ఆఫ్రికన్ కంట్రీ మాలిలో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు ఇండియన్ కార్మికుల్ని దుండగులు కిడ్నాప్ చేశారు. వెస్ట్రన్ మాలిలోని కోబ్రీలో విద్యుదీకరణ ప్రాజెక్టు పనుల్లో వారుండగా ఇది జరిగినట్లు భద్రతావర్గాలు AFPకి తెలిపాయి. మిగతా కార్మికుల్ని రాజధాని బమాకోకు తరలించారు. అల్‌ఖైదాతో సంబంధాలున్న JNIM జిహాదీలు ఇటీవల ముగ్గురిని అపహరించి $50Mలు తీసుకొని విడిచిపెట్టారు. తాజా ఘటనపై ఇంకా ఏ సంస్థా స్పందించలేదు.
News November 8, 2025
ఇజ్రాయెల్ PM అరెస్టుకు తుర్కియే వారెంట్

గాజాలో విధ్వంసం, నరమేధానికి కారణమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అరెస్టుకు తుర్కియే వారెంట్ జారీచేసింది. ఆయనతో పాటు మంత్రులు కట్జ్, ఇతమాన్ బెన్ గ్విర్, ఇతర అధికారులతో మొత్తం 37 మందిని వారెంటులో చేర్చినట్లు ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఖండించింది. తుర్కియే నిరంకుశ పాలకుడు ఎర్డోగన్ ప్రజలను మభ్యపెట్టే స్టంట్ ఇది అని విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ విమర్శించారు.


