News February 19, 2025
నుమాయిష్‌లో సింగరేణి సేవా సమితి స్టాల్‌కు ద్వితీయ బహుమతి

హైదరాబాద్‌లోని జరిగిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన మహిళా శక్తి మార్కెట్ స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్‌కు ద్వితీయ బహుమతి లభించింది. నుమాయిష్‌లో 2200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విభాగంలో సింగరేణి సేవా సమితి స్టాల్‌కు బహుమతి లభించింది. ఈ సందర్భంగా సంస్థ సీ అండ్ ఎండీ బలరామ్ మాట్లాడుతూ నుమాయిష్‌లో సంస్థకు గుర్తింపు రావడం అభినందనీయమన్నారు.
Similar News
News December 20, 2025
పాలమూరు: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

పెద్దకొత్తపల్లి మండలంలోని ఆదిరాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన జరిగింది. పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు అనే కానిస్టేబుల్ బైక్‌పై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 20, 2025
HYD: సూర్యుడొచ్చినా చుక్కలు చూపిస్తున్న చలి

HYD శివారు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. సూర్యుడు ఉదయించినా కనిష్ఠ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటంతో జనజీవనం గడ్డకట్టుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు చలితో గజగజ వణుకుతున్నారు. ఉ.9 దాటినా స్వెటర్లు, క్యాపులతోనే ప్రజలు కనిపిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు చలిగాలులకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి చలి తీవ్రత అసాధారణమని ప్రజలు వాపోతున్నారు. మీ ఏరియాలో చలి ఎలా ఉంది?