News February 9, 2025

నులిపురుగులపై అవగాహన కల్పించాలి: DEO

image

ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేయాలని గుంటూరు డీఈవో సీవీ. రేణుక ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నులి పురుగులపై అసెంబ్లీలో అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు విద్యార్థులతో వేయించాలన్నారు. హాజరు కాని విద్యార్థులకు 17వ తేదీన ఇవ్వాలన్నారు. 

Similar News

News February 10, 2025

గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో 0863-2241029 తో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ కంట్రోల్ రూమ్ సేవలు అందిస్తుందని అన్నారు. ఎన్నికల పై ఫిర్యాదు చేయడంతో పాటూ ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 9, 2025

ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

image

ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసానిచ్చారు.

News February 9, 2025

గుంటూరు ప్రజలకు SP సతీశ్ సూచన 

image

గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)ని రద్దు చేయడం జరిగిందని గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను తిరిగి ప్రకటిస్తామని చెప్పారు.

error: Content is protected !!