News February 3, 2025

నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు

image

నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు తప్పని సరిగా వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం సూర్యాపేట కలక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ డి వార్మింగ్ డే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి సన్నాహక సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10న అన్ని స్కూల్స్, సంక్షేమ హాస్టళ్లలలో మాత్రలు వేయించాలన్నారు.

Similar News

News February 4, 2025

EWS ప్రయోజనాల కోసం ఇలా..: బీసీ మేధావుల ఫోరం

image

TG: కులసర్వేలో బీసీల జనాభా తగ్గడంపై BC మేధావుల ఫోరం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు (51%) ఉంటే, ఇప్పుడు 1.64 కోట్లు (46.25%) మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని, OCల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు లేదా డేటా ఎంట్రీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చన్నారు.

News February 4, 2025

కామారెడ్డి: పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు సొన్నైల తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News February 4, 2025

కిడ్నీలలో రాళ్లు చేరకూడదంటే..

image

*రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
*ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.
*కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
*బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
*ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్లొద్దు.