News December 16, 2025

నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

image

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.

Similar News

News December 19, 2025

బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స

image

బ్రెస్ట్ క్యాన్సర్‌ గుర్తించడానికి మామోగ్రఫీ, MRI, అల్ట్రాసౌండ్, కోర్‌ బయాప్సీ, జెనెటిక్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ రిసెప్టర్, హర్‌–2 పరీక్ష, కొన్నిసార్లు ఫ్రోజెన్‌ సెక్షన్‌ ఎగ్జామినేషన్‌, స్కానింగ్ చేస్తారు. మొదటి, రెండో దశలో ఉంటే రొమ్ము క్యాన్సర్‌ తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. శస్త్ర చికిత్స, రేడియేషన్, హార్మోనల్‌ థెరపీ, కీమోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ చేస్తారు.

News December 19, 2025

BELOPలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>BEL<<>> ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(BELOP)5 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. 30ఏళ్ల లోపు కలిగి, BE, B.Tech (ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, E&TC, మెకానికల్ ) ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://bel-india.in

News December 19, 2025

దివ్యాంగులకు త్రీవీలర్స్, ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌కార్డులు: డోలా

image

AP: దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పనకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. 21 సెంచరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ద్వారా పోటీ పరీక్షలతోపాటు డిజిటల్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ట్రైనింగ్ అందిస్తామన్నారు. దివ్యాంగులకు ఫ్రీగా త్రీవీలర్స్ ఇస్తామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.