News July 7, 2025
నూజివీడు: అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నేడు జరిగింది. సకాలంలో అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే అధికారులు సరైన సమయానికి రాలేదు. ఇలాంటి ఘటనలు పునారవృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News July 7, 2025
కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన గవర్నర్

హనుమకొండ కలెక్టరేట్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో టీబీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు కలెక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.
News July 7, 2025
సమస్యలను త్వరగా పరిష్కరించాలి: సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజావాణి సమస్యలను పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
News July 7, 2025
10న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

కోనసీమ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి మీటింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు.