News November 19, 2025
నూజివీడు: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు సాధించిన ట్రిపుల్ ఐటీ బాలికలు

నూజివీడు పట్టణ పరిధిలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలోని 66 మంది బాలికలు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగావకాశాలను సాధించినట్లు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ..ఆర్జీయూకేటీ – ఏపీటీతో కలసి నిర్వహించిన నియామక డ్రైవ్‌లో బాలికలు ఉద్యోగాలు పొందినట్లు వివరించారు. వీరిలో 50 మంది సీఎస్ఈ, 9 మంది ఈసీఈ, ఏడుగురు ఈఈఈ విభాగాలకు చెందిన వారిగా తెలిపారు.
Similar News
News November 19, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తఏరువారిపల్లి విద్యార్థిని ఎంపిక

సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన అండర్- 14 ఖోఖో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లి హైస్కూల్ విద్యార్థిని హర్షవర్ధని సత్తా చాటి ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు PET అహ్మద్ చెప్పారు. హర్షవర్ధనికి ఉపాధ్యాయులు, సర్పంచ్ వెంకటయ్య, గ్రామస్థులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచాలని వారు కోరారు.
News November 19, 2025
NTRలో 1,18,629 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ

ఎన్టీఆర్ జిల్లాలో 1,18,629 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి మరికొద్ది సేపట్లో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ నిధులు జమ కానున్నాయి. మొత్తం రూ.79.72 కోట్లు ప్రభుత్వం జమ చేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తెలిపారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.59.31 కోట్లు కాగా, కేంద్రం నుంచి రూ.20.41 కోట్లు మంజూరు అవుతున్నట్లు స్పష్టం చేశారు.
News November 19, 2025
నల్గొండ: తరుగు పేరిట దోపిడీ.. ఏదీ నిఘా?!

అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే.. రైతుల దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు క్వింటాల్‌కు 3 కేజీల తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చర్లపల్లికి చెందిన K.లింగారెడ్డి అనే రైతు ఇటీవల అదే గ్రామంలోని హాకా కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే 140 బస్తాలు అమ్మగా సెంటర్ నిర్వాహకులు రికార్డులో నమోదు చేశారు. మిల్లు నుంచి వచ్చే తక్ పట్టీలో 137 బస్తాలు మాత్రమే ఉంది.


