News October 26, 2025
నూజివీడు: కార్తీక మాసంలోనూ తగ్గని మాంసం ధరలు

కార్తీక మాసంలోనూ నూజివీడులో మాంసం ధరలు తగ్గలేదు. ఆదివారం కిలో మటన్ రూ.750, చికెన్ రూ.220, రొయ్యలు రూ.300, చేపలు రూ.180 నుంచి రూ.380గా విక్రయిస్తున్నారు. జిల్లా కేంద్రం ఏలూరులో కిలో మటన్ రూ.900, చికెన్ రూ.220 నుంచి రూ.280, చేపలు రూ.150 నుంచి రూ.400, రొయ్యలు రూ.300గా ఉన్నాయి.
Similar News
News October 28, 2025
ఆదిలాబాద్: DEGREE ఫీజు కట్టారా..?

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును పొడగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 27 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించడానికి గడువు ముగిసింది. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 29 వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని వివరించారు. కావున విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.
News October 28, 2025
జూబ్లీ ఎన్నికల్లో 569 కంట్రోల్ యూనిట్లు

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేసి వాటిని సిరీస్ శ్రేణిలో ఏర్పాటు చేసి కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ మిషన్‌ను అనుసంధానిస్తారు. మొత్తం కంట్రోల్ యూనిట్లు 569, బ్యాలెట్ యూనిట్లు 2,442, వీవీ ప్యాట్లు 610 ఉపయోగించనున్నారు.
News October 28, 2025
సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

ముఖ్యమంత్రి చంద్రబాబును సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్‌తో పాటు పలువురు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 18వ తేదీ నుంచి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సీఎంకు తెలిపి, ఆహ్వాన పత్రిక అందించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ట్రస్టు సభ్యులతో సీఎం చర్చించారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని సీఎం హామీ ఇచ్చినట్లు రత్నాకర్ తెలిపారు.


