News October 5, 2024
నూజివీడు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి ట్రిపుల్ ఐటీలు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూర ప్రాంతాల్లోని తమ ఇళ్లకు వెళ్లేందుకు 45 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News January 9, 2026
మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ జిల్లా కార్యాలయ భవన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పణ విషయంలో జరిగిన జాప్యంపై సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలు పట్టవా..? అంటూ కమిషనర్‌ను నిలదీసింది. జాప్యానికి గల కారణాలపై వెంటనే అఫిడవిట్ వేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.
News January 8, 2026
జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పాల్గొన్నారు.
News January 8, 2026
కృష్ణా: గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి

జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి సకాలంలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం గృహ నిర్మాణం పురోగతిపై కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 103 గృహాలు మాత్రమే పూర్తి కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.


