News October 16, 2025

నూజివీడు: తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి.. భర్త అరెస్ట్

image

రెండేళ్ల కుమారుడికి మాటలు రావడంలేదని భర్త వేధింపులతో సాయి లక్ష్మి హైదరాబాదులో ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాఠకులకు విధితమే. భర్త, అత్తమామల వేధింపులతోనే తన కుమార్తె పిల్లలతో సహా మృతి చెందినట్లు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి భర్త నూజివీడు‌కు చెందిన చల్లారి అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Similar News

News October 16, 2025

MNCL: లొంగిపోనున్న మరో మావోయిస్టు నేత..?

image

అభయారణ్యంలోని మావోయిస్టులకు రోజురోజుకు గట్టి ఎదురుదెబ్బ తగలుతోంది. బుధవారం మహారాష్ట్రలో మల్లోజుల వర్గంలో లక్ష్మణచందాకు చెందిన మోహన్ బెల్లంపల్లికి చెందిన సరోజ లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మందమర్రికి చెందిన సింగరేణి కార్మిక సంఘం కార్యదర్శి బండి ప్రకాశ్ ఉరఫ్ బండి దాదా లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లొంగుబాటు చర్యలకుల మద్దతిస్తున్నట్లు సికాస పేరిట లేఖ విడుదలైంది.

News October 16, 2025

ADB: సపోర్ట్ ఇంజినీర్ పోస్టుకు దరఖాస్తులు

image

సపోర్ట్ ఇంజినీర్ పోస్టును అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అర్హతలు బీటెక్/ఎంసీఏ, టెక్నికల్ సపోర్ట్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలన్నారు. నెలకు రూ.35,000 చెల్లిస్తామని తెలిపారు. అగ్రిగేట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. 2025 జులై 1 నాటికి కనీస వయస్సు 18, గరిష్టంగా 46 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుందన్నారు.

News October 16, 2025

ట్రాఫిక్‌లోనే జీవితం అయిపోతోంది!

image

ఒకప్పుడు ఆశలు, అవకాశాలకు కేంద్రంగా ఉన్న ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ బెంగళూరు ఇప్పుడు కళ తప్పుతోంది. భారీ ట్రాఫిక్ జామ్స్, మౌలిక సదుపాయాలు క్షీణించడం, ఖర్చులు పెరగడం నగర జీవితాన్ని దుర్భరం చేశాయి. ఇక్కడి ప్రజల జీవితంలో ఏడాదికి సగటున 134 గంటలు ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. దీంతో చాలామంది వివిధ నగరాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అటు HYDలోనూ పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ పెరిగిపోయింది.