News July 12, 2024
నూజివీడు: త్రిపుల్ ఐటీ సీట్ల సాధనలో బాలికలదే పై చేయి

రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీలకు సంబంధించి విడుదల చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితాలో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 4,040 సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేయగా అందులో 2,713 మంది బాలికలు, 1,327 మంది బాలురు ఉన్నారు. సీట్లు సాధించిన బాలికల శాతం 67.15 కాగా, బాలురు శాతం 32.85 మాత్రమే. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,757 మందికి సీట్లు రాగా, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 283 మందికి సీట్లు వచ్చాయి.
Similar News
News March 1, 2026
అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.
News February 28, 2026
కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.
News February 28, 2026
కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.


