News August 21, 2025
నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న ట్రేడ్లలో అడ్మిషన్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రజిత బుధవారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 21 నుంచి 26 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News August 21, 2025
వినాయక చవితికి మండపాలు పెడుతున్నారా?

AP: రాష్ట్రంలో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ తెలిపింది. మండపం కోసం ganeshutsav.netలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అడ్రస్, మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లు, నిమజ్జనం తేదీ, ఏ వాహనంలో నిమజ్జనం చేస్తారనే విషయాలు పొందుపరచాలి. సైట్ నుంచే నేరుగా NOC డౌన్‌లోడ్ చేసుకుని మండపం ఏర్పాటు చేసుకోవచ్చు.
News August 21, 2025
సిబిల్ స్కోర్ లేకపోతే నో జాబ్.. కేంద్రం క్లారిటీ

IBPS సెలక్షన్ ప్రక్రియలో అభ్యర్థులు సిబిల్ స్కోర్ పొందుపరచాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. కానీ బ్యాంకులో ఉద్యోగంలో చేరే సమయంలో క్రెడిట్ స్కోర్ చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సిబిల్ రికార్డు అప్డేటెడ్‌గా లేకుంటే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి NOC తీసుకోవాలని సూచించారు. ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని బ్యాంకులు కోరుకుంటున్నట్లు తెలిపారు.
News August 21, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలతో రేవంత్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.