News April 3, 2025
నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 2, 2025
ఎగిరే కారు తెస్తున్నా: ఎలాన్ మస్క్

అసాధ్యాలను సాధ్యం చేసే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. తమ కంపెనీ నుంచి గాల్లో ఎగిరే కారును తెస్తున్నట్లు ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించారు. ఈ ఏడాదిలోనే దానికి సంబంధించిన ప్రొటో టైప్‌ను ప్రదర్శిస్తామన్నారు. అయితే ఆ కారుకు రెక్కలుంటాయా? హెలికాప్టర్‌లా ఎగురుతుందా? అనే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. తమ ఆవిష్కరణ ఊహలకు అందని విధంగా ఉంటుందని మాత్రం మస్క్ స్పష్టం చేశారు.
News November 2, 2025
ఏలూరు: లారీ ఢీకొని మహిళ మృతి

ఏలూరు రూరల్ మండలం మహేశ్వర పురం గ్రామానికి చెందిన ఎం. ఝాన్సీ (25) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లో మృతి చెందారు. భర్త నాగేంద్ర, ముగ్గురు పిల్లలతో కలిసి బైక్‌పై ఏలూరు వెళ్తుండగా, సుంకర వారి తోట వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, పిల్లలు గాయాలపాలయ్యారు. రూరల్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 2, 2025
విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి.. వివరణ కోరిన కలెక్టర్

గద్వాల మండలం వీరాపురం సమీపంలోని సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి థామస్‌పై ఉపాధ్యాయుడు శారీరకంగా దాడి చేసిన సంఘటనపై తగిన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయుడి నుంచి వివరణ కోరుతూ మెమో జారీ చేసినట్లు ఆయన అందులో పేర్కొన్నారు.


