News April 21, 2025

నూజివీడు: విహారయాత్రకు వెళ్లి విషాదం నింపాడు

image

నూజివీడు మండలం బత్తుల వారి గూడెం గ్రామానికి చెందిన యువకుడు పావులూరి శ్యామ్ కుమార్ (20) ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి రేవు వద్ద విహారయాత్రకు వెళ్లి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్యాం కుమార్ ఐటీఐ చదివి అప్రెంటిస్ పూర్తి చేసుకుని విజయవాడలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Similar News

News April 21, 2025

పురుషులు ఈ పదార్థాలు తింటే..

image

పురుషులు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే అది వారి సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటే శుక్రకణాల నాణ్యత తగ్గుతుందని తెలిపారు. రోజూ విపరీతంగా మద్యం సేవిస్తే వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న క్రీమ్, చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

News April 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

image

ఖమ్మం జిల్లాలో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముదిగొండ (బాణాపురం)లో 41.5, నేలకొండపల్లిలో 41.3, ఎర్రుపాలెంలో 41.0, చింతకాని, మధిరలో 40.9, కామేపల్లి (లింగాల), కారేపల్లిలో 40.7, రఘునాథపాలెం, వేంసూరులో 40.3, వైరా 40.2, సత్తుపల్లి 40.0, పెనుబల్లి 39.9, ఖమ్మం అర్బన్ 39.7, తిరుమలాయపాలెం 39.4, ఖమ్మం (R) పల్లెగూడెం 39.2, తల్లాడ 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 21, 2025

‘సేంద్రియ విధానంల సాగు శుభ పరిణామం’

image

నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రైతు అనుబంధ సంఘాలు సోమవారం రైతు మహోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేంద్రియ విధానంలో రైతులు పంటలు సాగు చేయడం శుభ పరిణామం అన్నారు. జిల్లా అధికారులు, మంత్రులు, కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, 5 జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు.

error: Content is protected !!