News February 2, 2025
నూతన చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ గిరిధర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేరన్యాయ చట్టాలు-2023 ద్వారా దర్యాప్తును వేగవంతంగా చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వనపర్తి ఎస్పీ గిరిధర్ అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ పోలీసు లీగల్ అడ్వైజర్, రిటైర్డ్ పీపీ రాములుతో నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడానికి నూతన చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
Similar News
News February 2, 2025
NGKL: బాలికపై బాబాయి అత్యాచారయత్నం.. కేసు నమోదు
నాగర్కర్నూల్ జిల్లాలో బాలికపై బాబాయి అత్యాచారానికి యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలంలోని ఓ తండాలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సొంత బాబాయి(యువకుడు) అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News February 2, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. ప్రజావాణి రద్దు: కలెక్టర్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని చెప్పారు.
News February 2, 2025
రాజమండ్రి: ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ కుమార్తె
తన తండ్రి మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె జనసేన నాయకురాలు బార్లంపూడి క్రాంతి తెలిపారు. రాజమండ్రిలో ఆమె పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నాన్న ఇంటిపై దాడి జరగడం చాలా బాధాకరమన్నారు. డిప్యూటీ సీఎం ఇటువంటి దాడులకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి జనసేన నాయకులు చేయించారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.