News June 29, 2024

నూతన చట్టాలపై అవగాహన పెంచుకోండి: ఏఎస్పీ

image

జులై 1వ తేదీ నుంచి నూతన చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై పుట్టపర్తి కోర్ టీంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై పోలీసు అధికారులు పూర్తిగా పట్టు సాధించాలన్నారు.

Similar News

News October 7, 2024

అనంతపురం జిల్లాలో 421 దరఖాస్తులు!

image

అనంతపురం జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో 136 మద్యం దుకాణాలకు గానూ 289, సత్యసాయి జిల్లాలో 87 దుకాణాలకు గానూ 132 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.

News October 7, 2024

లేపాక్షి: డివైడర్‌ను ఢీకొన్న కారు..ఇద్దరి మృతి

image

లేపాక్షి మండలంలోని చోళ సముద్రం సమీపంలో డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. బ్రహ్మకుమారీ ఆశ్రమంలోని 8 మంది ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మడకశిర వెళ్లి తిరుగుముఖం పట్టారు. ఈ నేపథ్యంలో రోడ్డు కుంగి ఉండడంతో కారు బోల్తా పడింది. ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎ. సరస్వతమ్మ, నారాయణమ్మలు మృతి చెందారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 7, 2024

కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఇలా..!

image

అనంతపురం పట్టణం పరిధిలోని స్థానిక కక్కలపల్లి మార్కెట్లో టమాటా ధరలు తగ్గాయి. ఆదివారం మొత్తం 18 మండీలకు 675 టన్నులు వచ్చాయి. కిలో గరిష్ఠంగా రూ.52, మధ్యస్థం రూ.40, కనిష్ఠం రూ.30 చొప్పున ధరలు పలికాయి. 15 కిలోల బుట్ట ధర గరిష్ఠం రూ.780, మధ్యస్థం రూ.600, కనిష్ఠం రూ. 450 చొప్పున ధరలు పలికాయని మార్కెట్ యార్డు ఇన్‌ఛార్జి రాంప్రసాద్ రావ్ ఓ ప్రకటనలో తెలిపారు.