News February 1, 2025
నూతన డీజీపీని కలిసిన బాపట్ల ఎస్పీ

నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాను బాపట్ల ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను డీజీపీకి వివరించారు.
Similar News
News September 16, 2025
రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా: కేటీఆర్

TG: సీఎం రేవంత్, కాంగ్రెస్ సర్కారు ఘోరతప్పిదంతో SLBC టన్నెల్ కూలిందని, ఈ ఘటనలో ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని KTR మండిపడ్డారు. ‘హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి డెడ్ బాడీలను మూడు రోజులైనా గుర్తించలేరా? ఇంతకన్నా చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటుందా? తమ ఆప్తులను చివరి చూపు చూసుకోలేని బాధిత కుటుంబాల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా?’ అని ప్రశ్నలు సంధించారు.
News September 16, 2025
నారాయణరావుపేట అత్యధిక వర్షపాతం

సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నారాయణరావుపేట మండలంలో 24.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిరుదొడ్డి మండలంలో 87 మి.మీ, బేగంపేటలో 86 మి.మీ, రాంపూర్‌లో 82.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 38.3 మిల్లీమీటర్లుగా ఉంది.
News September 16, 2025
పాలకొల్లు: స్కూలు బస్సు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

పాలకొల్లులో సోమవారం బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన ఏలూరి శ్రీను మృతి చెందాడు. శ్రీను తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కొబ్బరి వలుపు పని నిమిత్తం శ్రీను పాలకొల్లుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.