News December 24, 2025
నూతన పెన్షన్లపై అనంతపురం కలెక్టర్ కీలక ప్రకటన

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నూతన పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం స్పౌజ్ కేటగిరీ కింద భర్త మరణించిన వితంతువులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర కేటగిరీల దరఖాస్తుదారులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి ఉండాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు.
Similar News
News December 25, 2025
NGKL: గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం: కలెక్టర్

జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
News December 25, 2025
NGKL: షెడ్యూల్ తెగల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి

జిల్లాలోని షెడ్యూల్ తెగల విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎస్టి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలో ఐదో తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న ఎస్టీ విద్యార్థులు, 9వ,10వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 25, 2025
TRAIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<


