News December 30, 2025

నూతన సంవత్సర వేడుకలు చట్టబద్ధంగానే జరుపుకోవాలి: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక సూచనలు చేశారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. డీజేలు, బాణాసంచా నిషేధమని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుతంగా, కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు.

Similar News

News January 2, 2026

నూతన బాపట్ల జిల్లా మ్యాప్ ఇదే..!

image

బాపట్ల జిల్లా నూతన మ్యాప్‌ను అధికారులు విడుదల చేశారు. గతంలో ఆరు నియోజకవర్గాల్లో 25 మండలాలతో బాపట్ల జిల్లా ఉంది. రాష్ట్రంలో జిల్లాల విభజన జరగడంతో బాపట్ల జిల్లాలోని అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలిపారు. దీంతో బాపట్ల జిల్లా ఐదు నియోజకవర్గాలకు పరిమితమై, 20 మండలాలు ఉన్నాయి.

News January 2, 2026

94 వేల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలోని 141 గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామ సభలలో రైతులకు రాజముద్రతో కూడిన 94,090 నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. పాత భూహక్కు పత్రాల స్థానంలో ఇవి అందజేస్తామని పేర్కొన్నారు. శుక్రవారం కల్లూరు మండలం తడకనపల్లెలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు.

News January 2, 2026

నర్సాపూర్ బీవీఆర్ఐటీలో టెట్ పరీక్షా కేంద్రం

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.