News February 18, 2025

నూత‌న సాగు విధానాలు అభివృద్ధి పరచాలి : కలెక్టర్

image

ప్ర‌కృతి సేద్యం, నూత‌న సాగు విధానాలు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు మార్కెటింగ్ స‌దుపాయం కల్పించాలని జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. మంగ‌ళ‌వారం స్థానిక‌ క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. వ్యవసాయ రైతులకు గిట్టుబాటు ధరకు కల్పించే విధంగా సేవలందించాలని తెలిపారు.

Similar News

News October 30, 2025

విశాఖ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

image

రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం రవాణా శాఖ అధికారులు విశాఖలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 36 వాహనాలను తనిఖీ చేశారు. రహదారి నియమాలు పాటించకుండ, పర్మిట్ నియమాలను అతిక్రమించి తిరుగుతున్న ఒక బస్సుపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో టాక్స్, పెనాల్టీ రూపేణా 2,45,000 వసులు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.

News October 30, 2025

విశాఖ నగర డీసీపీ-1గా జగదీశ్ అడహళ్లి నియామకం

image

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి జగదీశ్ అడహళ్లిని విశాఖపట్నం నగర డీసీపీ-1గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో UPSCలో 440వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారి అయిన ఆయన, మొదట అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన జగదీశ్ అడహళ్లి తాజా బదిలీతో విశాఖ డీసీపీ-1 నియమితులయ్యారు.

News October 30, 2025

విశాఖలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కారణమిదే

image

భవనం నిర్మించుకుంటే డబ్బులు ఇవ్వాలంటూ ముగ్గురు బెదిరిస్తున్నారని మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రాంజీ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ తన ఇంటిపై అదనపు అంతస్తు నిర్మిస్తుండగా ఇదే ప్రాంతానికి చెందిన నర్సింగరావు, అరుణ్ బాబు, శంకర్రావు బెదిరించడం వల్లే తాను అత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రసాద్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు. దీంతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.