News December 2, 2024

నృత్య ప్రదర్శనలో నిర్మల్ చిన్నారుల ప్రతిభ

image

నిర్మల్ జిల్లా శ్రీ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్‌కు చెందిన చిన్నారులు ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రాలను పొందారు. ఈ సందర్భంగా చిన్నారులను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.

Similar News

News December 26, 2024

నిర్మల్‌: చెత్త కవర్‌లో శిశువు మృతదేహం లభ్యం

image

మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్‌లో చోటుచేసుకుంది. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ కవర్ కింద పడింది. సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో నవజాత శిశువు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. 

News December 26, 2024

ADB: బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడి రిమాండ్

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఈ నెల 21న ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు చెట్ల పోశెట్టి అలియాస్ అనిల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఉట్నూర్ డిఎస్పీ సీహెచ్ నాగేందర్ తెలిపారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం నిందితుడిపై ఫోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇచ్చోడ సీఐ భీమేష్ తదితరులున్నారు.

News December 26, 2024

బెల్లంపల్లి: డ్రైవర్‌ను కొట్టి కారు ఎత్తుకుపోయిన దుండగులు: సీఐ

image

డ్రైవర్‌ను బండరాళ్లతో కొట్టి కారును దుండగులు ఎత్తుకుపోయిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. CI అబ్జాలుద్దీన్ వివరాల ప్రకారం..ముగ్గురు వ్యక్తులు కాగజ్ నగర్ నుంచి మంచిర్యాలకు వెళ్లాలని కారు కిరాయి మాట్లాడుకొని బయలుదేరారు. బెల్లంపల్లి వద్ద కారు ఆపి డ్రైవర్‌ను కొట్టి అతను వద్దనున్న రూ.3,500/-నగదు, సెల్ ఫోన్ దొంగిలించారని డ్రైవర్ పురుషోత్తం కొడుకు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయిందని సీఐ వివరించారు.