News April 9, 2025

నెక్కొండలో లక్క పురుగుల నుంచి కాపాడండి!

image

నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల లక్క పురుగుల ద్వారా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లక్క పురుగుల నుంచి తమకు కాపాడాలని కోరుతున్నారు. సంబంధిత గోధుమలను తనిఖీ చేసి నివారణ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని తెలుపుతున్నారు.  

Similar News

News April 17, 2025

WGL: మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,500 పలికింది. అలాగే పసుపు(కాడి) క్వింటాకి ధర రూ.14,117 వచ్చింది. మరోవైపు మక్కలు(బిల్టీ) క్వింటా ధర రూ.2,365 పలికినట్లు అధికారులు వెల్లడించారు.

News April 17, 2025

వరంగల్: నేటి నుంచి భూభారతిపై అవగాహన సదస్సు: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మండల కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. కొత్త ఆర్ఆర్ చట్టం అమలుపై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చనని సూచించారు.

News April 17, 2025

నర్సంపేట: అయ్యో.. పండ్ల రైతులకు ఎంత కష్టమచ్చెనే!

image

పండ్ల సాగుతో కాసుల పంట పండిద్దామనుకున్న ఉద్యాన రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. నర్సంపేట డివిజన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే వరుస వర్షాలకు అరటి, మామిడి, బొప్పాయి ఇతర పండ్ల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో మామిడి, దుగ్గొండి, నర్సంపేటలో అరటి తోటలు పదుల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 80 ఎకరాల్లో పంట నష్టాన్ని ఉద్యాన అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు.

error: Content is protected !!