News February 7, 2025

నెక్కొండ: ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలేనా..?

image

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని ఆ గ్రామాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. రాబోయేది పంచాయతీ ఎన్నికలా..? లేక మున్సిపల్ ఎన్నికలో తెలియక ప్రజలు ఎదురు చూస్తున్నారు. నెక్కొండను మున్సిపాలిటీగా చేసేందుకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు. నెక్కొండతో పాటు నెక్కొండ తండా, టీకే తండా, గుండ్రపల్లి, అమీన్‌పేటల్లో గ్రామ సభలను సైతం నిర్వహించారు. కానీ ఇంత వరకు స్పష్టత లేకపోవడంతో ప్రజలు, అధికారులు అయోమయంలో పడ్డారు.

Similar News

News February 7, 2025

సమ్మక్క-సారలమ్మ గద్దెలపై హుండీలు ఏర్పాటు

image

మేడారం చిన్న జాతర ఈనెల 12 నుంచి 15 వరకు జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సమ్మక్క-సారలమ్మ ఆలయాల్లో ఎండోమెంట్ అధికారులు హుండీలను ఏర్పాటు చేశారు. సమ్మక్క గద్దెపై 14 హుండీలు, సారలమ్మ గద్దెపై 14 హుండీలు, పగిడిద్దరాజు గద్దెపై 2 హుండీలు, గోవిందరాజుల గద్దెపై 2 హుండీలు మొత్తం 32 హుండీలను ఏర్పాటు చేశారు. ఈవో రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతి, పరకాల డివిజన్ ఇన్‌స్పెక్టర్ కవిత, అర్చకులు పాల్గొన్నారు.

News February 7, 2025

సినిమా రంగంలో కురవి కుర్రాడు!

image

మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన శ్రీనాథ్ సినీ రంగంలో తొలి అడుగు వేశారు. సినీ రంగంపై మక్కువ పెంచుకున్న శ్రీనాథ్.. తల్లిదండ్రుల ఆశీస్సులతో, కఠోర శ్రమతో నేడు అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. శుక్రవారం విడుదలయ్యే నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్ చిత్రంలో తన ప్రతిభ పరిచయం చేయనున్నారు.

News February 7, 2025

ఎస్టీపీ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలి: కలెక్టర్

image

ఎస్టీపీ ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని వరంగల్ & హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, ప్రావీణ్య అన్నారు. కుడా కార్యాలయంలోని సమావేశ మందిరంలో బల్దియా ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ ఎస్టీపీల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తింపుపై అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 2055 సంవత్సరానికి గాను 21.31 లక్షల జనాభాకు అవసరమయ్యే డ్రైనేజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు.

error: Content is protected !!