News January 30, 2025
నెక్కొండ: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు!

కారు ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నెక్కొండ నుంచి కేసముద్రం వెళ్లే రోడ్డులో అప్పలరావుపేట గ్రామ శివారు మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి పల్టీ కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 18, 2025
చెత్త వెస్తే జరిమానా విధించడం: కలెక్టర్ హెచ్చరిక

ఏలూరు జిల్లాలోని కాలవల్లో, రోడ్డు ప్రక్కన కొందరు చెత్త వేస్తున్నారని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మండిపడ్డారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లో వెట్రిసెల్వి మాట్లాడారు. నగరం, పట్టణం, పల్లెల్లో యథేచ్చగా ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అధికారులకు ఆదేశించారు. చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దటానికి అన్ని ప్రాంతాల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు.
News October 18, 2025
పాడేరు: అనారోగ్యంతో వ్యక్తి మృతి.. అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యమే కారణం?

పాడేరు మండలం చౌడుపల్లికి చెందిన మాదెల రామ్మూర్తి అనారోగ్యానికి గురవడంతో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని గురువారం రాత్రి వైద్యులు విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. రామ్మూర్తిని తరలించడంలో అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎట్టకేలకు వేరే అంబులెన్సులో విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అంబులెన్సు సిబ్బంది లేట్ చేయడం వల్లే రామ్మూర్తి మృతి చెందాడని బంధువులు ఆరోపించారు
News October 18, 2025
గుంటూరు జిల్లాలో ఎందరో గాన గంధర్వులు

గుంటూరు జిల్లా అంటేనే కలలకు పుట్టినిల్లు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు జిల్లాకి ఖ్యాతి తెచ్చారు. S.జానకి, MS రామారావు, శ్యామనారాయణ, కల్యాణం రఘురామయ్య, చిత్తూరు నాగయ్య, నాగభైరు అప్పారావు, మాతంగి విజయరాజు, వారణాసి రామసుబ్బయ్య, షేక్ నాజర్, మాధవపెద్ది సత్యం, మనో, సునీత తదితరులు నేపధ్య గాయని, గాయకులు తెలుగు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు.
@నేడు ప్రపంచ గాన దినోత్సవం