News March 2, 2025

నెక్కొండ: భార్య తిట్టిందని పురుగుమందు తాగాడు: SI

image

భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెక్కొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సె మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటతండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. భార్య తిట్టడంతో బాధపడిన శ్రీనివాస్ పురుగుమందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

Similar News

News November 7, 2025

అనంతపురంలో మహిళలకు ప్రత్యేక జాబ్‌ మేళా

image

అనంతపురంలోని రుద్రంపేట బైపాస్‌లో ఉన్న వాల్మీకి భవన్‌లో ఈ నెల 11వ తేదీ ఉదయం 11.30 గంటలకు జాబ్‌ మేళా జరగనుంది. అంబికా ఫౌండేషన్, దగ్గుబాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మహిళల కోసం ప్రత్యేకంగా ఈ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

News November 7, 2025

రాష్ట్ర ఉత్తమ టీచర్‌గా బుట్టాయిగూడెం మాస్టారు

image

బుట్టాయిగూడెం జెడ్పీ హైస్కూల్ టీచర్ గుర్రం గంగాధర్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లో అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సిస్టం విధానాన్ని అధ్యయనం చేయటానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు వారం రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఆయనను జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు.

News November 7, 2025

హైవేపై 10 కి.మీ రన్నింగ్ చేసిన గోరంట్ల మాధవ్

image

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ శుక్రవారం ఉదయం రాయదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై రన్నింగ్ చేశారు. రాయదుర్గం నుంచి మారెంపల్లి వరకు సుమారు 10 కి.మీ దూరం ఆయన పరిగెత్తడం చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో సీఐగా పనిచేసిన ఆయన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రాయదుర్గంలో ఓ వివాహ వేడుకకు వచ్చిన ఆయనను స్థానిక వైసీపీ నేత, వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ తదితరులు కలిసి ముచ్చటించారు.