News September 22, 2025

నెక్సస్ HYD మాల్ 11వ వార్షికోత్సవ వేడుకలు

image

నెక్సస్ హైదరాబాద్ మాల్ 11వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ‘City Under Siege’ పేరుతో సౌతిండియాలోనే తొలి అనిమాట్రానిక్ అలియన్స్ ఇన్‌స్టాలేషన్‌ను అందిస్తోంది. లైఫ్-సైజ్డ్ అలియన్స్, అలియన్ రైడ్, థీమ్ వర్క్‌షాప్స్‌తో వినూత్న అనుభవాన్ని అక్టోబర్ 31 వరకు పొందవచ్చు. అలాగే అక్టోబర్ 2 వరకు షాపింగ్ ఫెస్టివల్‌లో లగ్జరీ కార్, గోల్డ్, సిల్వర్, గాడ్జెట్లు గెలిచే అవకాశం ఉంది.

Similar News

News September 23, 2025

ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ

image

నల్గొండ: జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా ఉత్సవాలను జరుపుకోవచ్చని చెప్పారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలను, యువతులను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడాలని ఎస్పీ కోరారు.

News September 23, 2025

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టర్

image

జాతీయ రహదారుల భూ సేకరణ పురోగతిపై కలెక్టర్ లతో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగిత్యాల కలెక్టరేట్ నుండి కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత పాల్గొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూ సేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితర అధికారులున్నారు.

News September 23, 2025

జగిత్యాల: ‘బాధితులకు సత్వర న్యాయం అందించాలి’

image

ప్రజల సౌకర్యార్థం సోమవారం జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ స్వయంగా పాల్గొని 8 మంది అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని, ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పొందుపరచి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.