News March 11, 2026
నెక్స్ట్ T20 కెప్టెన్ సంజూ కావొచ్చు: కైఫ్

సూర్యకుమార్ ఫిట్‌గా ఉన్నంత కాలం T20 టీమ్ కెప్టెన్‌గా కొనసాగొచ్చని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. ఒకవేళ ఆయన తప్పుకొంటే కెప్టెన్‌గా సంజూ శాంసన్ సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. IPLలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా అతనికి ఉన్న అనుభవం కలిసొస్తుందని పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన 31 ఏళ్ల సంజూ టీమ్‌ను నడిపించగల సమర్థుడని కొనియాడారు.
Similar News
News April 14, 2026
రియల్ హీరో❤️

వేసవిలో పక్షులకు కాసిన్ని నీళ్లు పెట్టడానికే మనం విసుగు చెందుతాం. కానీ గుజరాత్ జూనాగఢ్‌కు చెందిన హర్సుఖ్‌భాయ్ వఘాసియా మాత్రం పదివేల పక్షులకు ‘అన్నదాత’గా మారారు. 28 ఏళ్ల క్రితం ఒక పిట్టతో మొదలైన ఆయన ప్రయాణం.. నేడు 4 ఎకరాల్లో 10వేల పక్షుల కడుపు నింపే స్థాయికి చేరింది. దీనికోసం ఆయన ఏటా ₹2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. విలాసాలకు దూరంగా ఉంటూ మూగజీవాల సేవకే జీవితాన్ని అంకితం చేసిన వఘాసియా నిజమైన హీరో.
News April 14, 2026
‘త్రిశంకు స్వర్గం’ గురించి తెలుసా?

అటూ ఇటూ కాకుండా నిలిచిపోయిన పరిస్థితిని ఈ జాతీయంతో పోలుస్తాం. ఇక్ష్వాకు వంశ రాజు త్రిశంకుడికి మానవ శరీరంతోనే స్వర్గంలోకి వెళ్లాలని కోరిక. దానికోసం యజ్ఞం నిర్వహించాలని వశిష్ఠుడిని కోరగా తిరస్కరిస్తారు. విశ్వామిత్రుడు తన తపోశక్తితో ఆయనను స్వర్గ ద్వారం వద్దకు చేరుస్తారు. ఇంద్రుడు అడ్డుకోవడంతో త్రిశంకుడు భూమిపై పడిపోతుండగా విశ్వామిత్రుడు మరో స్వర్గాన్ని సృష్టిస్తారు. అదే త్రిశంకు స్వర్గం. <<-se>>#EPICSAYINGS<<>>
News April 14, 2026
29న క్యాబినెట్ భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై చర్చ!

AP: ఈనెల 29న వెలగపూడి సచివాలయంలో CM CBN అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈమేరకు ప్రతిపాదనలతో నివేదికలు పంపాలని CS అన్ని శాఖలకు సర్క్యులర్ జారీచేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు, అమరావతి రెండో దశ భూ సమీకరణ, తొలిదశ సేకరించిన భూముల్లో పనుల పురోగతి, వివిధ సంస్థలకు భూముల కేటాయింపు, ఎంఓయూల మేరకు వివిధ సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.


