News March 1, 2025
నెన్నెలలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నెన్నెల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సంతోష్ తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాత్రి బైక్ పై తన సొంతూరు ఎల్లారం వైపు వెళ్తుండగా బొప్పారం సమీపంలోని నర్సరీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కాగా ఆయన భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News March 1, 2025
కొత్తగూడెం: ‘వారి ప్రాణత్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ’

ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగ ఉద్యమ నాయకులను స్మరించుకుంటూ శనివారం కొత్తగూడెం పట్టణ కేంద్రంలో వారికి పూలతో ఘన నివాళులు అర్పించారు. అమరులైన వారి ప్రాణ త్యాగాల ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు సలిగంటి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, చరణ్, చందు, సాయికుమార్, కిషోర్, అనిల్, భరత్, రాకేశ్ పాల్గొన్నారు.
News March 1, 2025
పాల్వంచ: సదరం కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..

ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కోసం యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. శనివారం సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్ఎంవో రమేశ్‌తో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
News March 1, 2025
ADB ఇంటర్ బోర్డు అధికారిగా జాధవ్ గణేశ్

ఆదిలాబాద్ ఇంటర్ బోర్డు అధికారిగా (DIEO) GJC ప్రిన్సిపల్ జాధవ్ గణేశ్ కుమార్‌ను నియమిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు DIEOగా ఉన్న రవీందర్ కుమార్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో గణేశ్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం DIEOగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పి స్వాగతించారు.