News April 16, 2025
నెన్నెల: 9 మంది నేరస్థుల బైండోవర్

నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు నేరస్థులను మంగళవారం నెన్నెల తహశీల్దార్ ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. పేకాట కేసులో ఐదుగురు, గంజాయి కేసులో మరో నలుగురు నిందితులను బైండోవర్ చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. నేరస్తులు తమ ప్రవృత్తిని మార్చుకోవాలని సూచించారు. ముందు మంచి ప్రవర్తనతో ఉండాలన్నారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Similar News
News April 16, 2025
పబ్‌లో HYD అమ్మాయిలతోనూ డాన్సులు

HYD చైతన్యపురిలోని పబ్‌లో యువతులతో <<16103579>>అర్ధనగ్న<<>> డాన్సులు చేయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా..ఇందులో ముంబై యువతులే కాకుండా HYDలోని వనస్థలిపురం, ఉప్పల్, సికింద్రాబాద్ అమ్మాయిలతోనూ డాన్సులు చేయిస్తున్నట్లు గుర్తించారు. యువకులను ఆకర్షించేందుకు పబ్‌లోకి ఫ్రీగా పంపించి, వారికి కంపెనీ ఇస్తూ అధికమొత్తంలో ఖర్చు చేయించి ఆ బిల్ కూడా వారితో కట్టిస్తున్నట్లు అధికారులు తేల్చారు.
News April 16, 2025
రామగిరి హెలిప్యాడ్ ఘటన.. వారు విచారణకు వస్తారా?

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండో షీల్డ్‌కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియజేయాలని పైలెట్, కోపైలెట్‌కు చెన్నేకొత్తపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హాజరైతే హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు.
News April 16, 2025
ECIL నుంచి భూపాలపల్లి జిల్లాకు డ్రోన్ల అందజేత

ECIL తన సొంత మేధా సంపత్తితో 12 డ్రోన్లు, 20 ఎలక్ట్రిక్ బైకులను భూపాలపల్లి జిల్లాకు సమకూర్చినట్లుగా తెలిపింది. భూపాలపల్లి జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ సేవలందించే సూపర్వైజర్లకు ఎలక్ట్రానిక్ బైక్లను అందిస్తారని పేర్కొంది. ఈ డ్రోన్ల ద్వారా వైద్య సేవలను సైతం మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగించుకోవడానికి వీలుంటుందని ECIL తెలిపింది.