News February 1, 2026
నెయ్యిని నాభి వద్ద రాస్తే..

నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. చర్మం పొడిబారడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు నాభికి గోరు వెచ్చని నెయ్యి అప్లై చేయడం వల్ల క్రాంప్స్ వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. ఫెర్టిలిటీ సమస్యలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు నెయ్యిలో ఉన్నాయి.
Similar News
News February 15, 2026
జనజీవన స్రవంతిలోకి రండి.. మావోలకు TG పోలీస్ పిలుపు

TGలోని అండర్‌గ్రౌండ్ మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. లొంగిపోయే వారికి ప్రభుత్వ ‘సరెండర్&రిహాబిలిటేషన్’ పాలసీ కింద తక్షణ ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు అందుతాయని DGP శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండేళ్లలో 588 మంది సాధారణ జీవితంలోకి వచ్చి గౌరవప్రదంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన 15 మంది వెంటనే లొంగిపోవాలని కోరారు.
News February 15, 2026
T20 WC: USA భారీ స్కోర్

చెన్నై: నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన USA 20 ఓవర్లలో 199-4 స్కోర్ చేసింది. సంజయ్ కృష్ణమూర్తి (68*), మోనాంక్ పటేల్ (52) రాణించారు. సంజయ్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ఆయన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. NAM బౌలర్లలో విల్లెమ్, గెర్హార్డ్ ఎరాస్మస్ చెరో 2 వికెట్లు తీశారు.
News February 15, 2026
రైతులకు రూ.20వేలు ఎక్కడంటూ CBNకు YCP ప్రశ్న

AP: కూటమి ప్రభుత్వంలో అన్నదాతను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపించింది. ‘అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఏటా రూ.20,000 ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మోసాన్ని భరించక తప్పడం లేదు. అరకొర నిధుల కేటాయింపుతో ఈ ఏడాదీ రైతులకు తిప్పలే’ అని ట్వీట్ చేసింది.


