News January 29, 2026
నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI తేల్చింది: YCP

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CBN చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టిందని YCP విమర్శించింది. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని CBI తేల్చినట్లు వివరించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను CBN దెబ్బతీశారని పేర్కొంది. ‘నిజం బయటపడింది.. మీలో ఏమాత్రం నిజాయతీ ఉన్నా లెంపలేసుకుని భక్తులకు క్షమాపణలు చెప్పు CBN’ అని ట్వీట్ చేసింది.
Similar News
News February 20, 2026
రాష్ట్రంలో వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని RTGS అంచనా వేసింది. సెంట్రల్ ఆంధ్ర, ఉత్తర కోస్తా, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.
News February 20, 2026
బంగ్లాకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్నిరకాల వీసా సర్వీసుల పున:ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ రీఓపెన్ అయ్యింది. త్వరలోనే IND కూడా సర్వీసులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. బంగ్లాలో హాదీ హత్యతో అల్లర్లు చెలరేగడం, అక్కడి హిందువులపై దాడితో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
News February 20, 2026
నవజాత శిశువుల్ని ఇలా రక్షిద్దాం..

నవజాత శిశువుల్లో 80 శాతం మంది నెలలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని యునిసెఫ్ నివేదిక తెలిపింది. వీటిని నివారించడానికి న్యూ బోర్న్ స్క్రీనింగ్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. పుట్టిన 48-96 గంటల మధ్య ఈ పరీక్ష చేస్తారు. శిశువు మడమ నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీనివల్ల వ్యాధులను ముందుగా గుర్తించడం వల్ల శారీరక, మానసిక వైకల్యాలతో సహా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చు.


