News January 30, 2026
నెయ్యి పేరుతో YCP రూ.250కోట్ల కుంభకోణం: జనసేన

AP: నెయ్యి వాడకుండానే దాని పేరుతో YCP ప్రభుత్వం రూ.250కోట్ల కుంభకోణం చేసిందని జనసేన ఆరోపించింది. ‘‘ఆవు నెయ్యికి బదులు ప్రమాదకర రసాయనాలతో 68లక్షల కిలోల సింథటిక్ నెయ్యి వాడి లడ్డూ ప్రసాదాన్ని TTD గత పాలకులు దోపిడీకి కేంద్రంగా చేసుకున్నారు. నెయ్యి సేకరణలో కుట్ర, ఫేక్ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగంపై ఆధారాలున్నట్టు CBI నేతృత్వంలోని SIT దర్యాప్తులో తేలింది’’ అని SMలో పోస్టు పెట్టింది.
Similar News
News February 25, 2026
SBIలో 116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

SBI 116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(AVP, డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc/BE/BTech, BCA/MCA, M.Tech, MSc, CA, ICAI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/
News February 25, 2026
పేరు మారిన రాష్ట్రాలు

☛ కేరళం-కేరళ, ట్రావెన్‌కోర్ కొచ్చిన్, ☛ ఆంధ్రప్రదేశ్-ఆంధ్ర రాష్ట్రం, ☛ తెలంగాణ- హైదరాబాద్ స్టేట్ ☛ మహారాష్ట్ర-బాంబే స్టేట్, ☛ గుజరాత్-బాంబే స్టేట్, ☛హిమాచల్ ప్రదేశ్-ఈస్ట్ పంజాబ్, ☛ పంజాబ్- ఈస్ట్ పంజాబ్ ☛ కర్ణాటక- మైసూర్ స్టేట్, ☛ ఒడిశా- ఒరిస్సా, ☛ తమిళనాడు- మద్రాస్ స్టేట్, ☛ఉత్తరాఖండ్- ఉత్తరాంచల్, ☛ఉత్తరప్రదేశ్- యునైటెడ్ ప్రావిన్సెస్, ☛మధ్యప్రదేశ్- మధ్య భారత్
News February 25, 2026
చెరకులో పీక, కాండం తొలుచు పురుగు కట్టడికి సూచనలు

లోతైన కాలువల్లో ముచ్చెలను నాటి, వీలైనంత తక్కువ వ్యవధిలో నీటి తడులివ్వాలి. తోటల్లో మొక్క నాటిన 3వ రోజున, కార్శి తోటల్లో కార్శి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారీ చేయాలి. ట్రైకోగ్రామా ఖిలోనిన్ గుడ్డు పరాన్నజీవిని ఎకరాకు 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి.


