News January 12, 2026
నెలలో పెళ్లి.. అమెరికా అదుపులో నేవీ అధికారి!

అమెరికా స్వాధీనం చేసుకున్న <<18803079>>రష్యా నౌకలో<<>> ముగ్గురు భారతీయులు ఉండటం తెలిసిందే. అందులో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ రిక్షిత్ చౌహాన్(26) కూడా ఉన్నారు. ఫిబ్రవరి 19న ఆయన పెళ్లి జరగాల్సి ఉంది. రష్యా సంస్థ ఆయన్ను తొలిసారి సముద్ర విధులకు పంపింది. ఈ క్రమంలో ఈనెల 7న చౌహాన్‌తో మాట్లాడామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కొడుకును సురక్షితంగా తీసుకురావాలని తల్లి రీతాదేవి వేడుకుంటున్నారు.
Similar News
News February 16, 2026
ఏటి ఈతకు లంక మేతకు సరి

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News February 16, 2026
విరమణ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి?

రోజంతా ఉపవాసం ఉన్నందున, విరమణ సమయంలో ఒకేసారి భారీ ఆహారం తీసుకోకూడదు. ముందుగా మంచినీరు, పండ్ల రసంతో కడుపుని తేలికపరచాలి. ఆ తర్వాత సాత్విక ఆహారమైన అన్నం, పప్పులు వంటి సులభంగా అరిగే పదార్థాలను తీసుకోవాలి. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదని పండితుల సూచన.
News February 16, 2026
శివరాత్రి జాగరణ.. ఇవాళ ఏం చేయాలంటే?

శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండి జాగరణ చేసిన భక్తులు ఇవాళ ఉదయం శివాలయానికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అనంతరం ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలని చెబుతున్నారు. నిన్న ఉపవాసం, జాగరణ చేసిన వారంతా ఇవాళ రాత్రి అయ్యే వరకూ నిద్రపోకూడదని, అలా చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.


