News April 10, 2025
నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ: ఎస్పీ జగదీష్

అనంత జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ జగదీష్ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO& రేప్ కేసులు, ప్రాపర్టీ, దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ & ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, 174 Cr.P.C కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, పెండింగ్ NBWs, NDPS కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి చర్చించారు.
Similar News
News April 18, 2025
MEMU రైలు అనంతపురం వరకు..

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
News April 18, 2025
గుమ్మగట్ట: కరెంట్ షాక్‌తో టెన్త్ విద్యార్థి మృతి

గుమ్మగట్ట మండలం గొల్లపల్లిలో గురువారం రాత్రి విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి కార్తీక్ (16) ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తండ్రితో కలిసి కుమారుడు పొలానికి వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. యువకుడు గత నెలలోనే పది పరీక్షలు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.
News April 18, 2025
కియా ఇంజిన్ల చోరీ.. కీలక అప్‌డేట్

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక్కడ చోరీ చేసిన ఇంజిన్లను తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో విక్రయించినట్లు సమాచారం. కొనుగోలుదారులు ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు ఇప్పటికే అరెస్టైన వారిని త్వరలో కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.