News February 19, 2026
నెలసరికి ముందు ఇవి మేలు..

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్, మిల్లెట్స్, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.
Similar News
News February 21, 2026
షాకింగ్.. ఒకే పార్కులో 72 పులులు మృతి

థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేట్ పార్క్‌లో డెడ్లీ వైరస్ విజృంభించింది. దీంతో ఈనెల 8-19వ తేదీ మధ్య 72 పులులు మృత్యువాతపడ్డాయి. కనైన్ డిస్టెంపర్ వైరస్(CDV) కారణంగానే అవి చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంటువ్యాధి సోకగానే జ్వరం, కళ్ల నుంచి నీరు కారుతుంది. వాంతులు, విరేచనాలు వస్తాయి. కండరాలు బలహీనమై మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ముందస్తు టీకాతో నివారించవచ్చు. ఇది మనుషులకు సోకదు.
News February 21, 2026
లిక్కర్ స్కామ్.. A2 వాసుదేవరెడ్డి అరెస్ట్

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పని చేశారు. గతంలో ఈయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.
News February 21, 2026
గొర్రెల పెంపకం – పాక్షిక సాంద్ర పద్ధతి

పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెలను కొద్ది గంటల పాటు పచ్చిక బయళ్లలో మేపి మిగతా సమయం అంతా ఇంటివద్ద పాకలలో ఉంచి పెంచుతారు. అంతేకాక పాకలలో వాటికి పచ్చిగడ్డి, దాణా, త్రాగటానికి నీరు మొదలగునవి పెడతారు. ఈ పద్ధతిలో ఎంపిక చేసిన పొట్టేళ్లతోనే ఆడ గొర్రెలను జతకలపవచ్చు. బయట వృథాగా ఉన్న పచ్చిక బయళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.


