News May 15, 2024

నెల్లిమర్లలో 88.25% పోలింగ్

image

నెల్లిమర్ల నియోజకవర్గంలో 88.25% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో 2,13,551 మంది ఓటర్లు ఉండగా 1,88,456 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 92,820 మంది పురుషులు, 95,635 మంది మహిళలు, ఒకరు ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలే ఎక్కువ శాతం ఉండటం విశేషం. ఉమ్మడి విజయనగరంలో అత్యధిక పోలింగ్ శాతం నెల్లిమర్లలోనే నమోదైంది.

Similar News

News April 10, 2026

VZM: ‘ఏక మొత్తంలో పన్ను చెల్లిస్తే 5 శాతం రిబిట్’

image

ఆస్తి పన్నులను 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏకమొత్తంలో చెల్లించిన వారికి 5 శాతం రిబేటు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు విజయనగరం నగర పాలక కమిషనర్ బాలస్వామి గురువారం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్నులు, ఖాళీ స్థలాల పన్నులపై ఏక మొత్తంలో చెల్లించాలనుకునేవారు 50 శాతం రాయితీతో ఏప్రిల్ నెలాఖరు వరకు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 10, 2026

గంజాయి కేసుల్లో యువత ఉండడం ఆందోళనకరం: SP

image

గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి యువత దూరంగా ఉండాలని SP దామోదర్ సూచించారు. (NDPS) చట్టం ప్రకారం గంజాయి కేసుల్లో పట్టుబడితే 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. గత 6 నెలల్లో జిల్లాలో 20 కేసులు నమోదు చేసి 85 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని, సుమారు 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టైన వారిలో 35 మంది యువత ఉండడం ఆందోళనకరమన్నారు.