News September 4, 2025

నెల్లిమర్ల: డైరెక్టర్ పదవిని తిరస్కరించిన సువ్వాడ వనజాక్షి

image

రాష్ట్ర ప్రభుత్వం 11 కార్పొరేషన్లకు నామినేటెడ్ డైరెక్టర్లను నియమించిన సంగతి తెలిసిందే. వీటిలో మన విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. నెల్లిమర్లకు చెందిన సువ్వాడ వనజాక్షిని రాష్ట్ర గ్రీన్కో & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ గా ప్రకటించింది. ఆమె ఈ పదవిని సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు.

Similar News

News September 7, 2025

సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం: VZM కలెక్టర్

image

జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం మరోసారి ప్రకటించారు. రాజాంలోని నందిని ట్రేడర్స్‌కు ఈనెల 4న 24 టన్నుల యూరియా సరఫరా చేశామని, తగినంత స్టాకు ఉందన్నారు. షాపు దగ్గర నిలుచున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణే గొడవకు కారణమన్నారు. దీనికి ఎరువుల సరఫరాతో సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. అవసరమైనంత ఎరువులను సరఫరా చేస్తున్నామన్నారు.

News September 7, 2025

దావోస్ పర్యటనలో మంత్రి కొండపల్లి బిజీ బిజీ

image

దావోస్ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిజీ బిజీగా గడుపుతున్నారు. SME రంగం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎటువంటి ప్రోత్సాహకాలు అవసరం అనే అంశంపై గ్లోబల్ SME సమ్మిట్ -2025లో శనివారం ప్రసంగించారు. SMEల అభివృద్ధికి నూతన టెక్నాలజీతో పాటు, యూనివర్శిటీల నుంచే స్టార్టప్‌లను ప్రోత్సహించడం, పరిశోధన-అభివృద్ధి విభాగాల్లో వాటిని మరింత బలోపేతం చేయడం, తదితర అంశాలపై చర్చించారు.

News September 6, 2025

VZM: యూరియా పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

image

ప్ర‌స్తుతం విజయనగరం జిల్లాలో 1,122 మెట్రిక్ ట‌న్నుల యూరియా RSK, ప్ర‌యివేటు వ‌ర్త‌కుల వ‌ద్దా సిద్ధంగా ఉంద‌ని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. సోమ‌వారం మ‌రో 850 ట‌న్నులు, గురువారం 1,000 ట‌న్నులు యూరియా జిల్లాకు రానుంద‌ని పేర్కొన్నారు. ఇది కాకుండా ఈ నెలాఖ‌రుకి మ‌రో 3,000 మెట్రిక్ ట‌న్నుల యూరియా వ‌స్తుంద‌ని వెల్లడించారు. రైతులు షాపులవ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి క్యూల్లో నిల్చోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.