News February 18, 2026

నెల్లుట్లలో విపత్తు నిర్వహణ విన్యాసాలు

image

నెల్లుట్ల చెరువు వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ నిపుణులు బుధవారం నిర్వహించిన విపత్తు సన్నద్ధత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్, డీసీపీ, ఆర్డీఓ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. వరదలు, ప్రమాదాల సమయంలో ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో బృందం సభ్యులు ప్రత్యక్షంగా చేసి చూపారు. సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించగా, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

Similar News

News February 19, 2026

163 ఏళ్ల తర్వాత ఇలా.. మళ్లీ 2189లోనే!

image

ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల పండుగలు ఒకే సమయంలో రావడం చాలా అరుదు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్, క్రైస్తవ మతంలో ఈస్టర్ పండుగకు ముందు వచ్చే లెంట్, చైనీస్ ‘లూనార్ న్యూఇయర్’లు 1863లో 24 గంటల వ్యవధిలోనే ప్రారంభమయ్యాయి. మళ్లీ 163 ఏళ్ల తర్వాత 2026లో ఈనెల 17-18న ఇది ఆవిష్కృతమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మళ్లీ ఇలాంటి వింతను చూడాలంటే 2189 వరకు వేచి చూడాలి.

News February 19, 2026

యాదాద్రి జిల్లాలో బ్యాంకు అధికారుల సమావేశం

image

భువనగిరిలోని మినీ మీటింగ్ హాల్లో కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి వంటి పథకాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ పథకాలకు సంబంధించిన రుణ ప్రక్రియను బ్యాంకు ఉద్యోగులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.

News February 19, 2026

గుంటూరు మిర్చి యార్డులో సరకు రాక పెరుగుదల

image

గుంటూరు యార్డుకు మిర్చి టిక్కీల రాక బుధవారం పెరిగింది. మొత్తం 1,06,635 టిక్కీలు రైతులు తీసుకురాగా 1,02,831 విక్రయాలు జరిగాయి. నాణ్యతను బట్టి క్వింటాల్‌కు రూ.17,500 నుంచి రూ.24,500 వరకు ధర లభించింది. తక్కువ క్వాలిటీ సరకుకే ధర తగ్గిందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ఉదయం ఒప్పుకున్న ధరకే బిడ్డింగ్ చేయాలని అధికారులు కమిషన్ దుకాణాలకు సూచించారు. ఎగుమతి వ్యాపారులపై వచ్చిన ఫిర్యాదులపై పర్యవేక్షణ పెంచారు.