News December 20, 2024
నెల్లూరుకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నెల్లూరు నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంతోపాటే ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి అభినందనలు తెలిపారు.
Similar News
News December 15, 2025
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అమరజీవి

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి తన మరణంతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పడమటి పల్లి ఆయన పూర్వీకుల స్వగ్రామం కావడంతో అమరజీవి గౌరవార్థం ఆయన పేరు నెల్లూరు జిల్లాకు పెట్టారు.
News December 15, 2025
నెల్లూరు ర్యాలీలో YCP నేతకు అస్వస్థత

నెల్లూరు పార్లమెంట్ YSRCP పరిశీలకులు వెంకటరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపటి క్రితం వైసీపీ నేతలు VRC వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అందులో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురవ్వడంతో గమనించిన మాజీ ఎమ్మెల్యేలు ఆయన్ను చేతులు మీద హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెలిపారు.
News December 15, 2025
నోట్లో యాసిడ్ పోస్తానని బెదిరించారు: నెల్లూరు మాజీ మేయర్

నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డిపై మాజీ మేయర్ స్రవంతి సంచలన ఆరోపణలు చేశారు. ‘నెల్లూరులో పోలీసులను సైతం బెదిరిస్తున్నారు. నన్ను పదవి నుంచి తొలగించ వద్దని కొందరు ఆందోళన చేశారు. దీంతో 33వ డివిజన్ కార్పొరేటర్ చేత కోటంరెడ్డి ఫోన్ చేయించారు. నాకు మద్దతుగా నిలిచిన 70 ఏళ్ల వృద్ధుడి నోట్లో యాసిడ్ పోస్తామని, నరుకుతామని బెదిరించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఆమె స్పందించలేదు’ అని స్రవంతి చెప్పారు.


