News September 9, 2024
నెల్లూరులో అండర్ -14 క్రికెట్ జట్టు ఎంపిక

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా అండర్ – 14 క్రికెట్ జట్లను ఈ నెల 15న ఎంపిక చేయనున్నామని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నిఖిలేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్, డ్రస్ కోడ్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 1, 2026
ఆన్లైన్లో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా: నెల్లూరు డీఈవో

జిల్లాలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను http://deonellore.50webs.com/ ఆన్లైన్లో పొందుపరిచామని డీఈవో డా. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాల సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో రేపటి నుంచి 7వ తేదీ లోగా పని దినాలలో సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్స్‌లో అందజేయాలన్నారు.
News March 1, 2026
ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
News March 1, 2026
నెల్లూరు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఎస్పీ ఏమన్నారంటే.!

ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ అజిత వాజెండ్ల తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారని చెప్పారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.


