News January 21, 2025
నెల్లూరులో ఇద్దరు సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు

నెల్లూరు జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన ఇద్దరు సర్పంచ్‌లపై కలెక్టర్ ఓ ఆనంద్ చర్యలు చేపట్టారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గతంలో పనిచేసిన మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్‌లను సస్పెండ్ చేశారు. రేగడిచెలిక, పెమ్మారెడ్డి పాలెం సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేశారు.
Similar News
News February 20, 2026
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 11 ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించే ఈ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలల్లో 2024-25, 2025-28 విద్యా సంవత్సరంలో నిరవధికంగా చదివి ఉండాలని తెలిపారు. ఈ నెల 23 నుంచి మార్చి 31వ తేదీలోపు గేట్ వే ద్వారా ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.
News February 20, 2026
నెల్లూరు: గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 20, 2026
నెల్లూరు- బద్వేల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు వేగంగా అడుగులు..!

రాయలసీమ, నెల్లూరు జిల్లాల పారిశ్రామికీకరణలో కీలకమైన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. మనుబోలు మండలంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి కడప జిల్లా బద్వేల్ వరకూ నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్ట్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మనుబోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది.


