News July 21, 2024
నెల్లూరులో ఈ నెల 23న జాబ్ మేళా

నగరంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ తెలిపారు. మహాలక్ష్మిపురం శరత్ ఇండస్ట్రీలో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభాగంలో పనిచేయటానికి ఐటిఐ, డిప్లోమో, బీటెక్ చదివిన విద్యార్థులు ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 22, 2026
కావలి: దైవ దర్శనాకి వెళ్లి ఒకరి మృతి

దైవ దర్శనానికి వెళ్తూ ఒకరు మృతి చెందిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. కావలికి చెందిన పురుషోత్తం(60) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఏడువారాల వేంకన్నను దర్శించుకోవాలని రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నుంచి ఆటోలో ఆలయానికి బయలుదేరగా RTC బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. పురుషోత్తం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆత్రేయపురం SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 22, 2026
నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.