News April 13, 2026
నెల్లూరులో ఎమ్మెల్సీ vs మంత్రి..!

నెల్లూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్‌గా మారుతోంది. వైసీపీ సిటీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి వరుస ప్రెస్‌మీట్లతో మంత్రి నారాయణపై అవినీతి ఆరోపణలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్, మొక్కల పెంపకంలో రూ.కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు. దీనికి మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన అనుచరులే తిప్పికొడుతున్నారు. మంత్రి మౌనం ఎన్నిరోజులు అనేది ప్రశ్నార్థకం.
Similar News
News April 15, 2026
1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.
News April 15, 2026
సీజ్ చేసిన బంగారాన్ని వదులుతారా చంద్రబాబు: YS జగన్

‘సీజ్ చేసిన బంగారాన్ని మీ ప్రభుత్వం విడుదల చేస్తుందా.. అలాంటప్పుడు సీజ్ చేసిన బోట్లను ఏవిధంగా వదిలి పెడతారు’ అని CM చంద్రబాబును మాజీ CM జగన్ జువ్వలదిన్నెలో ప్రశ్నించారు. మత్స్యకారుల గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదన్నారు. తాము బ్లూ రేవల్యూషన్ పెంచేందుకు ప్రతి 50 కీ.మీ లకు హార్భర్‌లను తీసుకోచ్చమన్నారు. ఫిషింగ్ హార్భర్‌ను జాతికి అంకితం చేస్తే.. ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎందుకు ఇవ్వలేదని ఆరోపించారు
News April 15, 2026
ఇంటర్ ఫలితాలు.. 7వ స్థానంలో నెల్లూరు జిల్లా

ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా <<19653702>>విద్యార్థులు సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 25147 మందికి 19682 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 24141 మంది పరీక్షలు రాయగా 19771 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ఇంటర్-1 ఇయర్‌లో 7వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 9వ స్థానంలో నిలిచింది.


