News April 15, 2025

నెల్లూరులో కానిస్టేబుల్ భార్య సూసైడ్ 

image

నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. చిన్నబజారు Ci కోటేశ్వరరావు వివరాల మేరకు.. AR కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో కలిసి ములాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈక్రమంలో ఇంట్లోనే పూర్ణిమ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మొదటి భార్య సైతం ఉరేసుకుని చనిపోయారని తెలుస్తోంది.

Similar News

News April 16, 2025

ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు: జేసీ కార్తీక్

image

నెల్లూరు నగరంలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ కార్తీక్ అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.

News April 15, 2025

నెల్లూరు: ఇంజినీరింగ్ విద్యార్థులకు గమనిక

image

 ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025-26 ఇంజినీరింగ్ విద్యార్థులకు సమ్మర్ ఆన్‌లైన్ షార్ట్ టర్మ్ ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తున్నామని నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం ఓ ప్రకటనలో తెలిపారు. 2 నెలలపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News April 15, 2025

నెల్లూరు చిన్నారుల గిన్నిస్ రికార్డ్

image

నెల్లూరుకు చెందిన రియో(9), జియాన్ (6) గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. హైదరాబాద్‌లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న జరిగిన మ్యూజిక్ విభాగం కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ మూడు  స్వరాలను 45 సెకండ్లలో పాడి రికార్డు సృష్టించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆ చిన్నారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్లను ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు.

error: Content is protected !!