News March 25, 2025

నెల్లూరులో జాడే లేని అనిల్ కుమార్ యాదవ్.?

image

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి దూకుడు పెంచారు. వరుసగా కార్యకర్తలు, నేతలను కలుస్తూ వారికి అండగా ఉంటున్నారు. MLC చంద్రశేఖర్ రెడ్డి సైతం అటు శాసనమండలి, ఇటు బహిరంగంగా టీడీపీ నేతలను ఎండగడుతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి వంటి నేతలు మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో కార్యకర్తలు, నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 18, 2026

నెల్లూరులో కనిపించిన నెలవంక.. టైమింగ్స్ ఇవే

image

నెల్లూరు జిల్లాలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం మొదలైంది. చిన్నాపెద్ద తేడా లేకుండా కఠోర ఉపవాస దీక్షలకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉంటారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గురువారం సమయాలు ఇలా ఉన్నాయి.
సహరి: ఉదయం 5.12గంటలకు
ఇప్తార్: సాయంత్రం 6:16 గంటలకు

News February 18, 2026

నుడాలో రూ.32.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు

image

నుడా పరిధిలో రూ.32.50 కోట్ల పనులకు ప్రతిపాదనలు వచ్చినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. వాటిల్లో రూ.28.60 కోట్ల పనులు మంజూరైనట్లు వివరించారు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్ష జరిగింది. జేసీ మాట్లాడారు. రాష్ట్రంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు అందరూ సహకరించాలన్నారు.

News February 18, 2026

నెల్లూరు: ఆ 6 గ్రామాల్లో సోలార్ సిస్టం

image

‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద నెల్లూరు జిల్లాలో ఆరు పల్లెలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటించారు. తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి విడతగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివేలపాలెం, మనుబోలు, కాకుపల్లిలో సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్తు ఆదాతో పాటు ప్రజలకు ఆదాయం వస్తుందన్నారు.