News January 30, 2025
నెల్లూరులో నెలవారీ నేర సమీక్షా సమావేశం

నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలలో రికవరీల గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. ప్రజలకు CCTV కెమెరాల ప్రాముఖ్యత వివరించి అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 28, 2026
అల్లు అర్జున్ ఫాన్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సనత్

నెల్లూరు జిల్లా అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఏ.సనత్ కుమార్, ఉపాధ్యక్షుడిగా పి.సాయి కుమార్ పేర్లును రాష్ట్ర అధ్యక్షుడు శివ శంకర్ ప్రటించారు. వీరితో 10మంది సభ్యులుగా నియమించారు.
News February 28, 2026
గూడూరు: శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సూసైడ్.. కారణం ఇదే!

గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బూదురు సునీల్ కుమార్ <<19259093>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. పొదలకూరులోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా చావుకు శ్రీచైతన్య స్కూల్ ఏజీఎం నర్ర శ్రీకాంత్ వేధింపులే కారణం. నా పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదివించాలన్నదే నా చివరి కోరిక’ అంటూ ఆయన సూసైడ్ లెటర్ రాశారు.
News February 28, 2026
నెల్లూరు: ప్రతి ఒక్కరికీ 125 పనిదినాలు

వీబీ జీ రాంజీ చట్టంపై మార్చి 27వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డ్వామా పీడీ గంగాభవాని తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. నూతన చట్టం ప్రకారం 125 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. గ్రామసభల్లో వివిధ అంశాలపై ప్రజలకు అన్ని వివరాలు వెల్లడించాలని ఆదేశించారు.


