News November 5, 2025
నెల్లూరులో మహిళ హత్య.?

నెల్లూరులోని వనంతోపు సెంటర్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పడేసి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహం ఆస్తి పంజరంగా మారిపోవడంతో నెల రోజుల కిందట ఈ ఘటన జరిగి ఉంటుందని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 5, 2026
కావలిలో వందే భారత్ రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

పలుకూరి చిన్నమ్మ(75) భర్తతో కలిసి విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలులో వచ్చి కావలి స్టేషన్‌లో దిగింది. కావలి నుంచి తూర్పు వైపు వైకుంటపురానికి వెళ్లేక్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా విజయవాడకు వెళ్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి GRP ఎస్ఐ వెంకట్రావు దర్యాప్తు చేస్తున్నారు.
News April 5, 2026
NLR: ‘ఫేస్ వాష్ అండ్ గో’తో ప్రమాదాలకు చెక్

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.
News April 5, 2026
TDPలోనే ఉంటాం: నెల్లూరు MP

జగన్‌ను కలిసే విషయయై YCP రాజ్యసభ MP అయోధ్య రామిరెడ్డితో నెల్లూరు MP వేమిరెడ్డి చర్చించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘మాకు కావాల్సింది గౌరవం. TDP ప్రభుత్వంలో చాలా గౌరవంగా ఉన్నాం. ఇదే పార్టీలోనే కొనసాగుతాం. రాజధానిపై YCPకి స్పష్టతలేదు. మావిగన్ అంటే జనాలు నవ్వుతున్నారు. తమిళనాడు బోట్లను అడ్డుకోవడానికి త్వరలో నెల్లూరుకు 2, తిరుపతి, బాపట్లకు ఒక్కోటి చొప్పున బోట్లు ఇస్తాం’ అని వేమిరెడ్డి చెప్పారు.


