News February 3, 2026
నెల్లూరులో రాజమండ్రి గంజాయి స్మగ్లర్‌పై PD యాక్ట్

నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కేసుల్లో పలుమార్లు నిందితుడిగా ఉన్న రాజమండ్రికి చెందిన ప్రకాశ్‌పై PIT-NDPS చట్టం కింద PD యాక్ట్ అమలు చేసినట్లు ఎస్పీ అజిత వేజండ్ల తెలిపారు. ఇప్పటికే పలు NDPS కేసుల్లో నమోదై ఉన్నప్పటికీ డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగించడంతో ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News February 17, 2026
పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

డిజిటల్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు కేంద్రం నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్‌లో యూపీఐకి ఆప్షన్ లేకపోవడం చర్చనీయాంశమైంది. అక్కడి ఫుడ్ స్టాల్స్.. ‘నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్’ అంటున్నాయి. UPI ఉంటుందిలే అనే ధీమాతో అక్కడికి వచ్చిన వారు చెల్లింపులకు ఇబ్బంది పడ్డారు. ఒకపక్క నో క్యాష్.. నో కార్డ్.. ఓన్లీ యూపీఐ అని ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
News February 17, 2026
మద్దిమడుగు పర్యటనలో సీఎంవో సెక్రెటరీ.. కలెక్టర్ స్వాగతం

మద్దిమడుగు క్షేత్రంలో సంతు సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారవుతున్న తరుణంలో సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాస్ రాజ్ మంగళవారం సందర్శించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ ఆయనకు స్వాగతం పలికి ఏర్పాట్లను వివరించారు. CM రేవంత్ రెడ్డి రాకను పురస్కరించుకుని భద్రత, ప్రోటోకాల్ అంశాలను సెక్రెటరీ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
News February 17, 2026
కృష్ణా: ఈ దృశ్యం..ఏం చెబుతోంది?

కృష్ణా జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం-విజయవాడ 216 జాతీయ రహదారిపై గూడూరు సెంటర్ వద్ద ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గూడూరు పోలీసులు మంగళవారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలతో కలిగే నష్టాన్ని అర్థమయ్యే విధంగా, యాక్సిడెంట్‌లో నుజ్జునుజ్జు అయిన వాహనాన్ని ఆ మార్గంలో ఉంచి వారికి అవగాహన కల్పిస్తున్నారు.


