News September 25, 2025
నెల్లూరులో రేషన్ అక్రమాలకు చర్యలు: మంత్రి

నెల్లూరు జిల్లాలో PDS రైస్ అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఒక చెకోపోస్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని మంత్రి మనోహర్ అసెంబ్లీలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.234 కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామన్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వరుసగా పీడీఎస్ రైస్ బయట ప్రాంతాలకు తరలి వెళ్తుండగా అధికారులు సీజ్ చేస్తున్నారు.
Similar News
News September 27, 2025
నెల్లూరు: పేదలందరికి ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత గుల్ల !

గతంలో కట్టిన పేదలందరికి ఇళ్లు నిర్మాణంలో నాణ్యత తీసికట్టుగా మారింది. గతంలో 97,466 ఇల్లు మంజూరైనా వీటిలో 39,985 మాత్రమే పూర్తయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. లేబర్ ఏజెన్సీల పేరుతొ కట్టిన ఈఇళ్లు సిమెంట్ కన్నా ఇసుకే ఎక్కువగా కలిపి కట్టారు. నెల్లూరు అర్బన్, రూరల్, కావలి, బుచ్చి, ఆత్మకూరు ప్రాంతాల్లో ఈ తంతు జరిగినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News September 27, 2025
నెల్లూరు: ఉన్నా నిరూపయోగం..!

జిల్లాలో కొన్ని శాఖలకు సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతుంటే మరి కొన్నిచోట్ల కట్టిన ప్రభుత్వభవనాలను ఉపయోగించడంలో తాత్సారం కనిపిస్తుంది. నెల్లూరు వైద్య విద్యార్థుల కోసం సంగంలో ఏర్పాటు చేసిన శిక్షణభవనం(రూ.1.27 కోట్లు), కావలి ఏరియాఆస్పత్రిలో రూ.55 కోట్లతో నిర్మించిన గదులు, వింజమూరు(M) గుండెమడకలలో రూ.27లక్షలతో నిర్మించిన గ్రంధాలయం, సంతపేటలో రూ.3.82కోట్లతో నిర్మించిన ఘోష ఆసుపత్రి భవననాలు నిరూపయోగంగా మారాయి.
News September 27, 2025
విమానాశ్రయానికి భూసేకరణ సమస్య : GM పద్మ

దగదర్తి విమానాశ్రయానికి భూసేకరణే ప్రధాన సమస్యగా మారిందని విమానాశ్రయ అభివృద్ధి సంస్థ GM పద్మ అన్నారు. శుక్రవారం ఆ భూములను అదాని పోర్ట్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రన్ వే నిర్మాణనికి భూ సమస్య నెలకొందన్నారు. విమానాశ్రాయానికి రవాణా రహదారి, రైల్వే మార్గాల గురించి తహశీల్దార్ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతినిధి గౌరవ్ అదాని పాల్గొన్నారు.