News December 30, 2024
నెల్లూరులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు: నుడా ఛైర్మన్

నెల్లూరు నగరంలో తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతూ రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఆదివారం స్టోన్ హౌస్ పేటలోని పాండురంగ అన్నదాన సమాజంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి కృషి చేశామని ఆయన అన్నారు.
Similar News
News January 1, 2026
నెల్లూరు: మొదలైన కోడి పందేలు..

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.
News January 1, 2026
నెల్లూరోళ్లు ఎన్ని ఫోన్లు పోగొట్టుకున్నారో తెలుసా..?

నెల్లూరు జిల్లాలో 2025 ఏడాదిలో చోరీకి గురైన ఫోన్ల ఖరీదు చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. ఒక్క ఏడాదిలోనే ప్రజలు 1140 మొబైల్స్ పోగొట్టుకున్నారు. వీటి విలువ రూ.2.28కోట్లు అని అధికారులు వెల్లడించారు. మన పోలీసులు ఈ ఏడాదిలో వీటిని రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దీన్ని బట్టి చూస్తే.. జిల్లాలో కాస్త ఆదమరిచినా మీ జేబులోని ఫోన్ పోవడం ఖాయం.
News January 1, 2026
నెల్లూరు జిల్లాలో 25మందికి జైలుశిక్ష

జిల్లాలో 18 ఏళ్ల లోపు ఉన్నవారిపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో కేసులు నమోదు చేస్తున్నారు. 2025లో 15 పోక్సో, రేప్ కేసులు నమోదయ్యాయి. 8 మర్డర్ కేసులు ఫైల్ చేశారు. ఇతర కేసులు 2 నమోదయ్యాయి. వీరిలో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి కఠిన కారాగార శిక్ష 20 ఏళ్లు, నలుగురికి 10 ఏళ్లు జైలుశిక్ష విధించారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్య జైలుశిక్ష ఏడుగురికి పడింది. మొత్తంగా 25మంది జైలుకు వెళ్లారు.


